పవన్ ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
on Apr 29, 2016

వరుణ్ తేజ్ లోఫర్ ఫ్లాప్ అవడంతో, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పూరీ జగన్నాథ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భారీ నష్టాలను ఎదుర్కొన్నామని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే, సినిమా ఆడకపోతే నేనేం చేసేదని పూరీ కూడా కౌంటర్ వేశారు. తాజాగా ఈ వివాదాన్ని యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఒక కొలిక్కి తెచ్చినట్టు కనిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నష్టపోయిన ప్రొడ్యూసర్లకు తన తర్వాతి సినిమాను తక్కువకే ఇప్పిస్తానని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే రూట్ ను వరుణ్ కూడా ఫాలో అవుతున్నాడు. లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ కు మిస్టర్ రైట్స్ ను తక్కువకే ఇప్పిస్తానని హామీ ఇచ్చాడట. దీంతో ఇక పూరీ డిస్ట్రిబ్యూటర్ల వివాదం ముగిసినట్లే అంటున్నారు సినీజనాలు. పెద్దరికంగా వరుణ్ తీసుకున్న ఈ స్టెప్ ను అందరూ హర్షిస్తున్నారు. బాబాయి చూపిన బాటలో నడిచిన అబ్బాయి, తన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం మంచి విషయమే మరి. కాగా, వరుణ్ శ్రీను వైట్ల మిస్టర్ సినిమా ముహూర్తపు షాట్ ను నిన్న లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీజేమేయర్ స్వరాలు అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



