'కూలీ నంబర్ 1' ట్రైలర్‌పై వెల్లువెత్తుతున్న హిలేరియస్ మీమ్స్!
on Nov 29, 2020
వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తోన్న 'కూలీ నంబర్ 1' మూవీపై బాలీవుడ్లో మంచి బజ్ నడుస్తోంది. శనివారం ఆ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక మరోసారి అది హెడ్‌లైన్స్‌లో నిలిచింది. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ కామెడీ డ్రామా అనేక కారణాల రీత్యా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రత్యేకించి, ఇది గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించగా కల్ట్ క్లాసిక్‌గా పేరుపొందిన 1995 నాటి 'కూలీ నంబర్ 1'కు ఆధునిక రీమేక్. అలాగే ఇది వరుణ్, సారా తొలి కలయికలో రూపొందుతోన్న చిత్రం. ఒరిజినల్‌ను రూపొందించిన డైరెక్టరే ఈ రీమేక్‌నూ తీయడం ఇక్కడ మరో విశేషం.
ట్రైలర్ రిలీజయ్యాక ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఆసక్తికరమైన విషయమేమంటే, 'కూలీ నంబర్ 1' ట్రైలర్‌పై సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్ పేలుతున్నాయి. గోవిందా క్లాసిక్ మూవీతో ఈ వరుణ్ సినిమాను కంపేర్ చేస్తూ చాలామంది దీనిపై సెటైర్లు వేస్తున్నారు. గోవిందా, కరిష్మా మ్యాజిక్కు రిక్రియేట్ చేసే క్రమంలో వరుణ్, సారా ఓవర్ యాక్టింగ్ చేశారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్లో ప్రత్యక్షమైన ఆ మీమ్స్ చూస్తుంటే ఎవరికైనా నవ్వాగదు. ఇంటర్నెట్ను ఈ మీమ్స్ ఇప్పుడు వెల్లువలా ముంచెత్తుతున్నాయి.
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ నటించిన కూలీ నంబర్ 1పై వచ్చిన మీమ్స్ ఎలా ఉన్నాయంటే...
Also Read