పిల్లను చూడండి... పెళ్లి చేస్తా!
on Oct 31, 2018
నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో వున్నాడని, ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే వున్నాయి. ఇటీవల వరలక్ష్మి తన సోల్‌మేట్ అని విశాల్ చెప్పారు. అలాగే, వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పడంతో వరలక్ష్మితో పెళ్లి అని మెజారిటీ ప్రేక్షకులు అనుకున్నారు. వరలక్ష్మి మాత్రం విశాల్‌ని తాను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. 'సర్కార్' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మి తనకు విశాల్ మంచి స్నేహితుడు మాత్రమేనని పేర్కొన్నారు. విశాల్‌తో పెళ్లి విషయం ప్రస్తావించగా "ప్లీజ్... విశాల్‌ని వరలక్ష్మి పెళ్లి చేసుకోవడం లేదని హెడ్డింగ్ పెట్టండి. ఇన్‌ఫ్యాక్ట్... విశాల్ కోసం నేను ఎవరైనా మంచి అమ్మాయి వున్నారేమో అని చూస్తున్నా. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా వుంటే చెప్పండి. మంచి పిల్లను చూడండి. నేనే పెళ్లి చేస్తా" అని వరలక్ష్మి సమాధానం ఇచ్చారు. తాను విశాల్‌తో డేటింగ్లో లేనని, విశాల్‌ని ప్రేమించడం లేదని ఆమె తెలిపారు.
వచ్చే ఐదేళ్లు లేదా పదేళ్లలో రాజకీయాల్లోకి వస్తానని, జయలలిత తనకు స్ఫూర్తి అని వరలక్ష్మి చెప్పారు. ఇండస్ట్రీలో 'మీ టూ' వుందని, ఎవరైనా లేదని చెప్తే వారు అబద్ధం ఆడుతున్నట్టే అని, తమిళ ఇండస్ట్రీలో తప్పు చేసినవారు తమ పేరు ఎప్పుడు బయటకు వస్తుందోనని భయపడుతున్నారని ఆమె అన్నారు.