'సీటీమార్'లో బికినీ బేబీ ఐటమ్ సాంగ్!
on Apr 5, 2020
బాలీవుడ్ హీరోయిన్, సూపర్ హాట్ మోడల్ ఊర్వశి రౌటేలా పేరు చెబితే ప్రేక్షకులకు హాట్ హాట్ బికినీ బాడీ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడీ అమ్మాయిని హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది తెలుగు తెరకు తీసుకొస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'సీటీమార్'. అందులో ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. లాక్ డౌన్ ముగిసిన తర్వాత గోపీచంద్, ఊర్వశి మీద సాంగ్ షూట్ చేస్తారట.
ఈమధ్య ఐటెమ్ సాంగ్స్ అంటే ఇండస్ట్రీలో ఎవరూ ఒప్పుకోవడం లేదు. వాటికి స్పెషల్ సాంగ్స్ అని కొత్త పేరు పెట్టారు. బాలీవుడ్ అడల్ట్ కామెడీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', అడల్ట్ హారర్ 'హేట్ స్టోరీ 4' సినిమాల్లో ఊర్వశి రౌటేలా నటించింది. సినిమాల కంటే సోషల్ మీడియాలో కుర్రకారుమతులు పోగొట్టే హాట్ హాట్ బికినీ ఫోటోలు చేయడంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఐటమ్ సాంగ్ అంటే ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో, ఎలా పిక్చరైజ్ చేస్తారో చూడాలి.