యూనిట్ మెంబర్‌కు కరోనా పాజిటివ్.. ఆగిన 'టక్ జగదీష్' షూటింగ్!
on Oct 17, 2020
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ అక్టోబర్ 7న పునఃప్రారంభమైంది. మొదట వరి పొలాల్లో నైట్ ఎఫెక్ట్‌లో నాని, మరికొంతమంది నటులపై సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ పునఃప్రారంభమైందని ఎనౌన్స్ చేస్తూ హీరో నాని, "జగదీష్ జాయిన్స్ టక్ బిగిన్స్ (జగదీష్ జాయినయ్యాడు టక్ మొదలైంది) #TuckJagadish” అని ట్వీట్ చేశాడు కూడా. పట్టుమని పది రోజులు గడిచాయో, లేదో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. కారణం ప్రధానమైన యూనిట్ మెంబర్స్‌లో ఒకరికి కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ కావడం. దాంతో చిత్రీకరణ నిలిపివేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ప్రస్తుతం నాని సహా యూనిట్ మెంబర్స్ అందరూ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారని సమాచారం. ఈ 10 రోజుల షూటింగ్లో నాని, హీరోయిన్ రీతూ వర్మ, మరికొంతమంది నటులు పాల్గొన్నారు. మరో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఈ షెడ్యూల్లో ఎంటర్ కాలేదు. ఈ మూవీలో జగపతిబాబు, రావు రమేశ్, నరేశ్ కీలక పాత్రధారులు. నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ స్వరాలు కూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Also Read