గుర్రపుస్వారీ నేర్చుకున్న త్రిష
on Nov 20, 2020
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 96తో మళ్ళీ వెలుగులోకి వచ్చారు అందాల తార త్రిష. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. వాటిలో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఒకటి. చోళుల పాలన నేపథ్యంలో సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో రాణి కుందవైగా నటిస్తున్నారు త్రిష.
అంతేకాదు.. కథానుసారం ఈ పాత్రకి గుర్రం మీద స్వారీ చేసే సన్నివేశాలు కూడా ఉంటాయట. అందుకోసం.. త్రిష హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని హార్స్ రైడింగ్ స్కూల్ లో జాయినయ్యారట మిస్ కృష్ణన్. మొదటి ఐదు రోజుల్లో ఇంట్రో టు హార్స్ బ్యాక్ రైడింగ్ కోర్స్ పూర్తి చేసిన త్రిష.. ఈ నెల 3 నుంచి ఫౌండేషన్ కోర్స్ ప్రారంభించి 10 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేశారట. అలాగే ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా త్రిషకు అందిందట.
మరి.. పాత్ర కోసం ఇంత కష్టపడ్డ త్రిషకి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.