అమితాబ్ కొవిడ్ నుంచి కోలుకోవాలని టాలీవుడ్ సెలబ్స్ ప్రార్థనలు
on Jul 12, 2020
అమితాబ్ బచ్చన్ కొవిడ్ 19 పాజిటివ్ అని నిర్థారణ అయిన విషయం తెలియగానే టాలీవుడ్ సహా దేశంలోని అన్ని భాషా చిత్రసీమలకు చెందిన సెలబ్రిటీలు పలువురు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దేశంలోని గొప్ప నటుల్లో ఒకరు కావడం, 77 ఏళ్ల వయసులోనూ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకరు కావడంతో ఆయనను అభిమానించే వాళ్లంతా ఆయన ఆరోగ్యాన్ని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మహేశ్, కె. రాఘవేంద్రరావు, డి. సురేశ్‌బాబు, రానా దగ్గుబాటి, జగపతిబాబు, కొరటాల శివ, ధర్మేంద్ర, హేమమాలిని, పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రీతి జింతా, అక్షయ్‌కుమార్, మమ్ముట్టి, మోహన్‌లాల్, ధనుష్, సోను సూద్ తదితరులు అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు.
Also Read