English | Telugu

తొలిప్రేమకు పెద్ద అండ.. ఇక కలెక్షన్ల వర్షమే...!!

on Feb 13, 2018

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన కూల్ లవ్‌స్టోరీ తొలిప్రేమ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రేమకథకు బ్రహ్మరథం పడుతుండటంతో.. వరుణ్ కెరీర్‌లోనే అత్యథిక కలెక్షన్లు రాబట్టింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు వరుణ్-రాశి జోడీకి ఫిదా అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చక్కటి ప్రేమకథ రాలేదని.. బాగా ఎంజాయ్ చేశానని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇక ఎల్లప్పుడూ యంగ్ టాలెంట్‌కు సపోర్ట్‌గా నిలిచే దర్శకధీరుడు రాజమౌళి కూడా తొలిప్రేమపై స్పందించారు. "నేను ప్రేమకథలను అంతగా ఇష్టపడనని.. కానీ తొలిప్రేమను మాత్రం బాగా ఎంజాయ్ చేశానన్నారు. మొదటి సినిమానే అయినప్పటికీ.. వెంకీ ఈ సినిమాను బా గా డీల్ చేశారు.. వరుణ్ నటుడిగా బాగా రాటుదేలాడు.. రాశీ గ్లామర్‌తోనూ.. నటనతోనూ ఆకట్టుకుంది.. నిర్మాత ప్రసాద్ గారికి, బాపిగారికి అభినంద‌న‌లు. నిర్మాణ విలువలు బాగున్నాయి" అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. జక్కన్న ట్వీట్ ద్వారా తొలిప్రేమకు మరింత పాజిటివ్ బజ్ వచ్చిందని.. ఇది వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here