'తీన్మార్' హీరోయిన్ పెళ్లెప్పుడంటే...
on Nov 26, 2020
బాలీవుడ్ యాక్టర్ పులకిత్ సామ్రాట్‌తో 'తీన్మార్' హీరోయిన్ కృతి ఖర్బందా డేటింగ్ చేస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైనప్పుడు.. ఆ ఇద్దరిలో ఎవరూ నోరువిప్పలేదు. కాలమే జవాబు చెబుతుందన్నట్లు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకుంటున్న పిక్చర్స్, వీడియోస్‌తో తమ రిలేషన్‌షిప్‌ను చెప్పకనే చెప్పారు ఆ ఇద్దరూ. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ పులకిత్ సామ్రాట్‌ను పెళ్లెప్పుడు చేసుకోబోతోందనే ప్రశ్నకు సమాధానం చెప్పింది కృతి.
బెంగుళూర్ మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇటీవల పులకిత్తో కలిసి చేసిన రోడ్ ట్రిప్ తాము ఒకరినొకరం బాగా అర్థం చేసుకోడానికి ఉపయోగపడిందని తెలిపింది. "పులకిత్ లాంటి వ్యక్తి నాతో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నా ముఖంలో నవ్వును చెదరనివ్వకుండా చూస్తుంటాడు తను. నేనూ అతని విషయంలో అదే చేయడానికి ట్రై చేస్తున్నా. అతని వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం. నన్నడిగితే, సెల్ఫ్-లవ్‌కు అతను బ్రాండ్ అంబాసిడర్ అంటాను" అని చెప్పింది కృతి.
ఇటీవల వచ్చిన 'తాయిష్' సినిమాలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరికీ ఆ సినిమా మంచిపేరు తెచ్చింది. ప్రొఫెషనల్‌గా మంచి స్థితిలో ఉన్న ఆ ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు ఒకటి కాబోతున్నారు? "మేం ఒకటిన్నర సంవత్సరం నుంచీ ప్రేమలో ఉన్నాం. ఇప్పటి దాకా మ్యారేజ్ గురించి మేం డిస్కస్ చేసుకోలేదు. ఇప్పటికిప్పుడు చేసుకోవాలనే ఆలోచన కూడా చేయట్లేదు. ప్రస్తుతం మేం మా కెరీర్స్ మీద ఫోకస్ పెట్టాం. పెళ్లనేది ఒక సుదూర కల" అని తెలిపింది కృతి. అదీ విషయం!
Also Read