ఆసక్తికర జోడీ: తమన్నా అండ్ సత్యదేవ్!
on Jul 14, 2020
అవును. మిల్కీ బ్యూటీ తమన్నా, హీరోగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న సత్యదేవ్ జంటగా ఓ సినిమా రూపొందనున్నది. కన్నడంలో పెద్ద విజయం సాధించిన 'లవ్ మాక్‌టైల్' మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ కన్నడ నటుడు కృష్ణ హీరోగా నటిస్తూ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కృష్ణ చేసిన పాత్రను సత్యదేవ్ చేయనుండగా, మిలనా నాగరాజ్ చేసిన పాత్ర చేసేందుకు తమన్నా అంగీరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక టాప్ లీగ్ హీరోయిన్‌తో జత కట్టడం సత్యదేవ్‌కు ఇదే ప్రథమం.
ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉండనుంది. ఒరిజినల్లో ఆ క్యారెక్టర్‌ను అమృతా అయ్యర్ ('30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ఫేమ్) చేసింది. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నాగశేఖర్ ఈ చిత్రాన్ని భావనా రవితో కలిసి నిర్మించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వచ్చాక సెప్టెంబర్ మధ్యలో షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. 'మత్తు వదలరా' చిత్రానికి అందించిన సంగీతంతో అందరి ప్రశంసలూ అందుకున్న కాలభైరవ (కీరవాణి తనయుడు) ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. కన్నడ చిత్రరంగానికి చెందిన సత్యా హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు.
Also Read