English | Telugu

మెగా హీరోలు... అభిమానులు మాత్రమేనా?

on Sep 5, 2019

 

'సైరా' విడుదలకు ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం లేదు. పబ్లిసిటీ ధూమ్ ధామ్ గా చేయాల్సిన అవసరం ఉంది. సాధారణంగా తెలుగు సినిమాకు నెల రోజులు అంటే పబ్లిసిటీకి చాలా అంటే చాలా ఎక్కువ సమయం ఉన్నట్టే. 'సైరా'ను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు కనుక పబ్లిసిటీకి టైమ్ తక్కువ ఉన్నట్టే. ఆల్రెడీ టీజర్ విడుదల చేసిన 'సైరా' టీమ్, సినిమా విడుదల తేదీ అక్టోబర్ 2కి ఓ వారం, పది రోజులు ముందు ట్రైలర్ విడుదల చేయాలనుకుంటోంది. అంతకంటే ముందు భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలనీ ప్లాన్ చేశారు. 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీశారు కనుక... రాయలసీమలోని కర్నూల్ జిల్లా నడిబొడ్డు కొండారెడ్డి బురుజు దగ్గర భారీ ప్రాంగణంలో ఫంక్షన్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు లక్షమంది అభిమానులు ఈ ఫంక్షన్ కి వస్తారని అంచనా. అయితే దీనికి ఎవరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే చర్చ మెగా ఫ్యామిలీలో జరిగిందట. 

ఒకానొక సమయంలో చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక ఇండస్ట్రీలో తోటి హీరోలను ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చిందట. అందరినీ పిలిచినా ఒకరు వచ్చి మరొకరు రాకపోతే ప్రేక్షకుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనీ, హీరోల మధ్య విబేధాలున్నాయని లేనిపోని కథనాలు వస్తే మొదటికి మోసం వస్తుందనీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని టాక్. మెగాస్టార్ స్టేజి మీద ఉండగా మరో అతిథి ఎందుకనే నిర్ణయానికి వచ్చేశారట. చివరకు, విజయవాడలో 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించినట్టు... 'సైరా' ఫంక్షన్ ను సైతం మెగా హీరోలు, అభిమానుల మధ్య చేయాలని డిసైడ్ అయ్యారట.

'ఖైదీ నంబర్ 150' ఫంక్షన్ కి, 'సైరా' ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే... ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువ. ఆల్రెడీ 'సైరా' టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలోనూ పవన్ వాయిస్ వినిపించనుంది. ఈ వేడుకకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ రానున్నారట. ఆయన సినిమాలో క్యారెక్టర్ చేశారు కనుక ముఖ్య అతిథి అనుకోలేం. చెన్నైలో నిర్వహించే 'సైరా' ప్రెస్ మీట్ కి కమల్ హాసన్, కేరళలో ప్రెస్ మీట్ కి మోహన్ లాల్ ను ఆహ్వానించాలని 'సైరా' టీమ్ ప్లాన్ చేస్తోంది. కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ విడుదల చేస్తారా? లేదా తర్వాత విడుదల చేస్తారా? అనేది ఇంకా డిసైడ్ కాలేదు. మరోవైపు మెగా అభిమానులు పాటలు ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here