జల్లికట్టు నేపథ్యంలో సూర్య డ్యూయల్ రోల్ మూవీ!
on Jul 11, 2020
సూర్య హీరోగా నటించే 40వ చిత్రాన్ని వెట్రిమారన్ డైరెక్షన్‌లో నిర్మిస్తానని గత ఏడాది డిసెంబర్‌లో పాపులర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్. థాను ప్రకటించినప్పుడు సినిమా ప్రియులందరూ ఆశ్చర్యపోయారు. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాకు 'వాడివాసల్' అనే టైటిల్ ఖాయం చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అతను తండ్రీకొడుకులుగా నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలైంది కూడా. కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆ తండ్రీకొడుకులు జల్లికట్టు ఆటలో ప్రవీణులుగా కనిపించనున్నారు.
జి.వి. ప్రకాశ్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ సినిమాకు పనిచేసే ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఈ సందర్భంగా సూర్య ఇదివరకు తండ్రీ కొడుకులుగా గౌతమ్ మీనన్ సినిమా 'వారణమ్ ఆయిరమ్', విక్రమ్ కుమార్ మూవీ '24'లో నటించిన విషయం ప్రస్తావనార్హం. 'వాడివాసల్' మూవీకి అదే పేరుతో తమిళ రచయిత సిఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారమంటున్నారు. 2017లో ఆ నవల సినిమా హక్కులను వెట్రిమారన్ పొందాడు. జల్లికట్టు ఆట నేపథ్యంలో ఆ నవల నడుస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
