ENGLISH | TELUGU  

రజనీకాంత్, పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేశాను: సుడిగాలి సుధీర్‌

on Nov 7, 2019

 

'జబర్దస్త్‌', 'ఢీ', 'పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, 'రాజుగారి గది' ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'సఫ్ట్‌వేర్ సుధీర్'. ఇది శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న తొలి చిత్రం. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది డాక్టర్‌ ఎన్‌. శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 10 మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచిందంటే ఈ మూవీపై ఆడియన్స్‌లో ఎంతటి క్యూరియాసిటీ ఉందో అర్థమవుతోంది. డిసెంబర్‌ మొదటి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ "ఈ సినిమా ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండే మూవీ. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సుధీర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. టీజర్‌కి 10 మిలియన్‌ వ్యూస్‌ రావడంతో సినిమా సక్సెస్‌ పట్ల నాకు, మా టీమ్‌కు కాన్ఫిడెన్స్‌ పెరిగింది. మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. మేం వైజాగ్‌లో తీద్దామండీ అంటే.. అలా కాదండీ మలేషియాలో అయితే బాగుంటుంది అని అక్కడ పాట చిత్రీకరించారు. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కావాలని సుధీర్‌ని, పెర్ఫామెన్స్‌కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో ధన్య బాలకృష్ణని హీరో హీరోయిన్లుగా సెలెక్ట్ చేశాం. ఇద్దరూ చాలా బాగా నటించారు. అలాగే మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఒక పాట పాడి అందులో నటించారు. ఇటీవల మనకు దూరం అయిన మాజీ ఎంపి, నటుడు డా. శివప్రసాద్‌గారు ఒక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు ఒక రోల్‌ చేశారు. ఈ చిత్రంతో తప్పకుండా సక్సెస్‌ సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం" అన్నారు.

హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ - "నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది. సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను. సుధీర్‌ అభిమానులు కేవలం ఆయన్ని ఫాలో చేయడం కాదు, ఆయన్ను ప్రేమిస్తారని షూటింగ్‌ మొదలు పెట్టిన రోజే తెలుసుకున్నాను. రేపు సినిమా హిట్‌ అయితే దానికి కేవలం ఆయన ఫ్యాన్స్‌ కారణం. రాజశేఖర్‌ రెడ్డి ప్రాపర్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌. ఆయన రైటింగ్‌లో కమర్షియాలిటీ ఉంది. అలాగే సోషల్‌ అవేర్నెస్‌ కూడా ఉంది. ఇంకో రెండుమూడేళ్లలో పెద్ద హీరోలతో తప్పకుండా వర్క్‌ చేస్తాడు. శేఖర్‌ రాజుగారికి తొలి సినిమా అయినా ఆర్టిస్టుల విషయంలో కానీ, టెక్నిషియన్స్‌ యాస్పెక్ట్‌లో కానీ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ - "మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌లో ఫస్ట్‌ మూవీ ఇది. రాజశేఖర్‌ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే సుధీర్‌గారిని మా బేనర్‌లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ధన్యవాదాలు. సినిమా తప్పకుండా సూపర్‌ హిట్‌ అవుతుంది" అన్నారు.

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ - "నేను పదేళ్ల క్రిందట హైదరాబాద్‌ వచ్చి ఫిలిం ఛాంబర్‌ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా లేదా? అనుకున్నాను. అలాంటిది ఇవ్వాళ నా ఫస్ట్‌ సినిమా ప్రెస్‌మీట్‌ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. 'చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు?' అని అడిగాను. వెంటనే 'రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతంరాజు ఎడిటర్‌, రామ్‌-లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌' అని చెప్పారు. అంత పెద్ద టెక్నీషియన్స్‌ నా సినిమాకు ఎందుకు వర్క్‌ చేస్తారు అనుకున్నాను. కానీ సెకండ్‌ మీటింగ్‌లో ప్రొడ్యూసర్‌గారితో వచ్చి అడ్వాన్స్‌ ఇచ్చి మార్చి 20న షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది అని చెప్పారు. మార్చి 20 నా లక్కీ డే. ఆరోజు నా రెండు సినిమాల షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. మొదటి రోజు షూటింగ్‌కు వెళ్ళగానే అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్‌ వేసి ప్రొడ్యూసర్‌గారు అక్కడే కూర్చొని అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. నా లైఫ్‌లో నేను ఇంకో సినిమా ఇంత పెద్ద టెక్నిషియన్స్‌తో చేస్తానో! లేదో తెలీదు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. మా నాన్న, బి.ఎ. రాజుగారు సన్నిహితులు. ఆయన నా సినిమాకి వర్క్‌ చేయడం చాలా హ్యాపీ. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ధన్య బాలకృష్ణగారితో షూటింగ్‌ ఫన్నీగా జరిగింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్‌ చేశాం. ఎలా ఉన్నాయో స్క్రీన్‌ మీద చూసి మీరే చెప్పాలి. అలాగే నా పేరు మీదే టైటిల్‌ ఉండడం కూడా హ్యాపీ. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు రజినీకాంత్‌గారు, పవన్‌ కల్యాణ్‌గారు. ఈ సినిమాలో వారిద్దర్నీ ఇమిటేట్‌ చేశాను. డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌ రిలీజ్‌ అనుకుంటున్నాం" అన్నారు.

నాజర్, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె. శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.