స్పైడర్ టీజర్ లో ఇవి గమనించారా?
on Aug 9, 2017

ఎక్కడ చూసినా ప్రస్తుతం టాపిక్ ‘స్పైడర్’టీజర్ గురించే. వన్ మినిట్ టీజరే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో! అని జనాల్లో ఒకటే క్యూరియాసిటీ. మురుగదాస్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఈ టీజర్ లో హైలెట్ అని చెప్పాలి. ఇక మహేశ్ గ్లామర్, స్టైల్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని మహేశ్ అంటుంటే... జనాల్లో ఓ విధంగా వైబ్రేషన్ కనిపిస్తోంది.
సామాజిక అంశాలో, సమస్యలో లేకుండా మురుగదాస్ కథలుండవ్. నాటి ‘రమణ’ నుంచి, ఇప్పటి ‘స్పైడర్’వరకూ ఒక్క సారి గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఏదో ఒక సమకాలీన సమస్యను ఎలివేట్ చేస్తూ... దాని చుట్టూ హీరోయిజాన్ని అల్లడం, దాన్ని పీక్ లో చూపించడం మురగదాస్ స్టైల్. ఆయన సినిమాల్లో కథనాలు కూడా ఊహకు అందవ్. హీరో అనేవాడు నేరాలు చేసినా... తెలివిగా చేస్తాడు. నేర సరిశోధన చేసినా తెలివిగా చేస్తాడు.
‘స్పైడర్’టీజర్ జాగ్రత్తగా చూస్తే అది అర్థమవుతుంది. ఈ దఫా కూడా ఏదో సమకాలీన సమస్యనే తీసుకున్నాడు మురుగదాస్. ‘పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు... గవర్నమెంట్, భూకంపం, ఈ సునామీలా.. నేనూ ఓ భాగమే’అనే డైలాగ్ లోనే ఏదో ఒక సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని అర్థమవుతుంది.
అలాగే... మహేశ్. చూడ్డానికి సాఫ్ట్ గా ఏదో.. సాఫ్ట్ వేర్ ఎంప్లయ్ లా కనపిస్తున్నాడు కానీ... ఈ ట్రైలర్ బట్టి చూస్తే.. అతను ‘కాప్’ అని అర్థమైపోతుంది. ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని ఓ వ్యవస్థ లా మాట్లాడటం.. తను కాప్ అని చెప్పకనే చెబుతోంది.
‘తుపాకి’ సినిమాలో కూడా అంతే కదా. అందులో విజయ్ మిలటరీ అధికారి. సమాజంలోని ఓ సమస్యపై తిరగబడతాడు. నేర పరిశోధనతో దేశానికి పట్టిన జాడ్యాన్ని వదలగొడతాడు. అందులో విజయ్ కూడా ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కడా మిలటరీ మనిషిగా కనిపించడు. ‘స్పైడర్’లో కూడా అదే ఫీట్ ని రిపీట్ చేసినట్టున్నాడు మురుగదాస్.
అంతాసరే... మరి ఈ ‘స్పైడర్’ మాటేంటి? ‘స్పైడర్’ అంటే తెలుగులో సాలి పురుగు. అంతకు ముందు విడుదల చేసిన టీజర్ లో కూడా ఒక యంత్రం లాంటి సాలిపురుగును చూపించాడు మురుగదాస్. ఆ టీజర్ చూసినప్పుడు మహేశ్ ఓ సైంటిస్ట్ లా అనిపించాడు. ఈ టీజర్ లో వేరేలా కనిపిస్తున్నాడు. ఇంతకీ మహేశ్ చేసింది పోలీస్ పాత్రా? సైంటిస్ట్ పాత్ర? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే..సెప్టెంబర్ 27 దాకా ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



