సిసిలియా..సిసిలియా..ఈ గోల ఏంటీ..?
on Sep 15, 2017
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న స్పైడర్ మూవీ ఆడియో రీసెంట్గా రిలీజైంది.. వాటిలో హే పిల్లా అచ్చచ్చా..సిసిలియా..సిసిలియా అంటూ సాగే ఓ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సాంగ్ వింటున్న వారిని ఓ పదం పిచ్చెక్కిస్తోంది. అదే సిసిలియా..సిసిలియా. ఈ పదానికి అర్థం కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు..కానీ రిజల్ట్ రాలేదు..ఈ నేపథ్యంలో అభిమానుల డౌట్ క్లియర్ చేశారు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. స్పైడర్ ఫ్రి రిలీజ్ కార్యక్రమంలో రామజోగయ్యతో మాట్లాడిన యాంకర్ సుమ సిసిలియా..సిసిలియా అంటే అందమైన అమ్మాయి అని శాస్త్రి గారు తనతో చెప్పారని తెలిపారు. దీనికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌లో తనకు భాగం కల్పించిన మహేశ్, మురుగదాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలాగే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.