తెలివితేటలు లేకపోతే ఎంత అందమున్నా వేస్టే!
on Oct 17, 2020
"కథానాయికగానే కాదు, సినిమాకు సంబంధించి ఏ చిన్న పాత్రలో కనిపించినా అది ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలి. చేసే పనిపై భక్తి శ్రద్ధలుంటేనే జీవితంలో పైకొస్తాం" అంటోంది శ్రుతి హాసన్. హీరోయిన్లకు అందంతో పాటు తెలివితేటలు కూడా ఉండాలనీ, అవి లేనప్పుడు ఎంత అందం ఉన్నా వ్యర్థమేననీ హితవు పలుకుతోంది. ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె, హఠాత్తుగా అవకాశాలు కోల్పోయి కొన్నాళ్లు తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయింది.
ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. రవితేజ జోడీగా 'క్రాక్'లో నటిస్తోన్న ఆమె, పవన్ కల్యాణ్ భార్యగా 'వకీల్ సాబ్'లో ఓ కీలక పాత్ర చేస్తోంది. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్‌లో తన ఫ్రెండ్స్‌తో రికనెక్ట్ అవుతూ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. మ్యూజిక్ వీడియోస్, కుకింగ్ వీడియోస్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.
Also Read