చెల్లెలు కావాలని నా కొడుకు ప్రార్థించడం వల్లే నాకు కూతురు పుట్టింది!
on Oct 17, 2020
ఈ ఏడాది ఫిబ్రవరిలో సరోగసీ ద్వారా తనకు కూతురు పుట్టిందని శిల్పా శెట్టి అనౌన్స్ చేసింది. ఆ పాపకు రాజ్ కుంద్రా, శిల్పా దంపతులు సమిష అని నామకరణం చేశారు. 'సమిష' అంటే అర్థమేమిటి? 'స' అంటే సంస్కృతంలో కలిగి (ఉండటం) అనీ, 'మిష' అంటే రష్యన్ భాషలో 'దేవత లాంటిది' అనీ అర్థమని చెప్పింది శిల్ప. మొత్తంగా సమిష అంటే లక్ష్మీదేవి అని ఆమె తెలిపింది.
తనకు లైఫ్‌లో ఒక చెల్లెలు కావాలని తన కొడుకు వియాన్ ప్రార్థించేవాడని శిల్ప వెల్లడించింది. "అద్భుతాలు జరగవని ఎవరు అంటారు. ఇప్పుడు నా చేతిని పట్టుకొని ఉన్నది (సమిష) అలాంటి అద్భుతమే. లైఫ్ అంటేనే ఒక మిరకిల్. కాదంటారా? ఇవాళ నాకెంతో సంతోషంగా ఉంది. సమిష మా కూతురు. ఆమెను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా నాకో రోజు అవసరం లేదు. మా ప్రార్థనలు, ప్రత్యేకించి వియాన్ ప్రార్థనలు చాలా అందంగా ఫలించాయి. దేవునికి ఎప్పటికీ రుణపడి ఉంటాం." అని చెప్పింది శిల్ప.
సమిష తమ జీవితాల్లోకి అడుగుపెట్టాక వచ్చిన తొలి డాటర్స్ డే అయిన సెప్టెంబర్ 27న వియాన్ తనకెంతో ఇష్టమైన బ్రౌనీస్ తింటూ సెలబ్రేట్ చేసుకున్నాడని శిల్ప వెల్లడించింది. "ఈ గ్లూటెన్-ఫ్రీ చాకొలేట్ బ్రౌనీస్ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాయి. ఇంట్లోనే వాటిని చేసుకోవచ్చు. పిల్లలు వాటిని బాగా ఇష్టపడతారు. బటర్ బదులు కొబ్బరి నూనె, ఎగ్స్ బదులు అవిసె గింజలు వేసి చేసుకుంటే ఆరోగ్యకరం" అని ఆమె సలహా ఇచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
