English | Telugu

గాళ్‌ఫ్రెండ్ వద్దు.... సెలవు కావాలి

on Jan 16, 2020

టాలీవుడ్ యంగ్ హీరోల్లో, ఎలిజిబుల్ బ్యాచిలర్లలో శర్వానంద్ ఒకడు. పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న పక్కన పెట్టండి. కనీసం ప్రేమలో ఉన్నాడేమో అని కనుక్కుందామని 'మీరు సింగిల్ గా ఉన్నారా? ప్రేమలో ఉన్నారా?' అని అడిగితే... "నేను సింగిల్. అలాగని, ఎవరితోనూ మింగిల్ కావడానికి రెడీగా లేను. నాట్ రెడీ టు మింగిల్. చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నాన్ స్టాప్ గా షూటింగులు చేస్తున్నాను. దీపావళికి అనుకుంట.... లాస్ట్ టైమ్ షూటింగులకు బ్రేక్ ఇచ్చి, సెలవు తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి చిన్న బ్రేక్ ఇచ్చాను. ఇప్పుడు నేను గాళ్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా కోరుకునేది సెలవుల్ని" అని శర్వానంద్ చెప్పాడు. అదీ సంగంతి!

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తమిళ హిట్ '96'కి రీమేక్ 'జాను' షూటింగ్ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో సమంత హీరోయిన్. తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు. అందులో రీతూ వర్మ హీరోయిన్ గా, అమల అక్కినేని హీరో తల్లిగా నటిస్తున్నారు. 'శ్రీకారం' అని మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూడు కాకుండా మరో మూడు సినిమాలు అంగీకరించానని చెప్పాడు. ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ పైకి తీసుకువెళ్తానని తెలిపాడు. 


Cinema GalleriesLatest News


Video-Gossips