'శకుంతలాదేవి' ట్రైలర్ రివ్యూ: విద్యా బాలన్ షో!
on Jul 15, 2020
'హ్యూమన్ కంప్యూటర్'గా పేరు గాంచిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శంకుతలాదేవి గురించి సగటు భారతీయ సినిమా ప్రేక్షకులకు బహుశా పెద్దగా తెలియకపోవచ్చు. బాలీవుడ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ స్పెషలిస్ట్ హీరోయిన్ విద్యా బాలన్ ఆవిడ బయోపిక్ చేయడంతో ఇప్పుడు ఎక్కువమందికి తెలుస్తుంది. అయితే, శకుంతలాదేవి అంటే ఆమె ముఖం బదులు విద్యా బాలన్ గుర్తొచ్చేంతలా ఆ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతూ ఉంది.
జూలై 31న అమెజాన్ ప్రైమ్‌లో 'శకుంతలాదేవి' విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాలో జస్ట్ లెక్కలు, శకుంతలాదేవి టాలెంట్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయకుండా హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'నాకు బేబీ కావాలి. భర్త కాదు' అంటూ అప్పట్లో పెళ్లి కాకుండా నచ్చిన వ్యక్తితో శృంగారం చేసిన మహిళగా శకుంతలాదేవిని చూపించారు. ఆమెను ద్వేషించే కుమార్తెను కూడా చూపారు. లెక్కలు కాకుండా ఎమోషన్స్ లెక్కలు కూడా సినిమాలో బాగా కుదిరాయి. వీటన్నిటి కంటే ముఖ్యంగా శకుంతలాదేవి పాత్రలో విద్యా బాలన్ వన్ మాన్ షో చేశారు. పాత్రలో చిలిపితనం, కొంటెతనం, భావోద్వేగాలు బాగా చూపించారు.