నాగశౌర్య జోడీగా సెన్సేషనల్ సింగర్!
on Nov 20, 2020
హ్యాండ్సమ్ యాక్టర్ నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ కాంబినేషన్లో ఐరా క్రియేషన్స్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ఇటీవల లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది.
ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్థానం పొందిన సంచలన గాయని, నటి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగశౌర్య జోడీగా ఎంపికవడం గమనార్హం. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'మస్కా'తో నటిగా ఎంట్రీ ఇచ్చిన షిర్లీ, త్వరలో శిల్పా శెట్టి, అభిమన్యు దస్సాని కాంబినేషన్ మూవీ 'నికమ్మా'తో బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా పరిచయం అవుతోంది. తెలుగు ప్రేక్షకులను ఆమె ఏ రీతిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దర్శకునిగా అనీష్ కృష్ణకు ఇది మూడో సినిమా. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Also Read