ఆ అశ్లీల చిత్రాలు నావి కావు
on Apr 19, 2014
హీరోయిన్ సంజన ఇటీవలే కన్నడంలో "అగ్రజ" అనే చిత్రంలో నటించింది. ఇందులో సంజన చాలా అశ్లీల సన్నివేశాలలో కనిపించింది. అయితే ఈ విషయంపై సంజన స్పందిస్తూ..."ఈ సినిమాలో నేను కొన్ని అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు చూపించారు. కానీ నేను అలాంటి సన్నివేశాల్లో నటించలేదు. "అగ్రజ" సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని హీరోయిన్ సంజన పేర్కొన్నారు. వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా గ్రాఫిక్స్ చేసి చూపించడం తనను ఎంతగానో బాధించిందంటూ" సంజన తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
సంజన చేసిన ఈ ఆరోపణలపై "అగ్రజ" చిత్ర దర్శకుడు శ్రీనందన్ స్పందిస్తూ..."ఇందులో సంజనపై చిత్రీకరించనున్న సన్నివేశాలు, కథ తదితర అన్ని విషయాల గురించి ఆమెకు ముందుగానే వివరించి చెప్పాము. ఇందులో ఆమెతో మాత్రమే చిత్రీకరించాము. ఎలాంటి మోసాలు మేం పాల్పడలేదు" అని అంటున్నారు.
ఈ శుక్రవారమే సినిమా విడుదలై ఇలా వివాదం రేగడంతో సినిమాలో ఏదో ఉందని అనుకుంటూ జనాలు బాగానే చూస్తున్నారట. మరి ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసం చేసిందా? లేక నిజంగానే ఆమెను వాడేసుకున్నారా? ఈ సినిమా గురించి ఇంకెన్ని విషయాలు భయటపడనున్నాయో త్వరలోనే తెలియనుంది.