`ఎంతసక్కగున్నావే` సమంత!!
on Dec 5, 2018
ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కుగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే...రంగస్థలం చిత్రంలో సమంతపై రామ్ చరణ్ పాడిన ఈ పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటే ఇప్పుడు సమంత , నందిని రెడ్డి కలయికలో వచ్చే సినిమాకు టైటిల్ గా మారినట్లు తెలుస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ చిత్రం చేయనున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ చిత్రానికి టైటిల్ కూడా కన్ ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కొరియన్ సినిమా `మిస్ గ్రానీ` చిత్రాన్ని సమంతతో నందిని రెడ్డి తెలుగులో రీమేక్ చేస్తోంది. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలు ఒక ఫొటో స్టూడియోకి వెళ్లి అక్కడ జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆ వృద్ధురాలు కాస్తా యంగ్ గా మారిపోతుంది. ఆ తర్వాత తన యవ్వనంలో కొచ్చిన తను ఏం చేసింది? అన్నది ఆసక్తికరమైన అంశం. అందుకే ఈ చిత్రానికి `ఎంత సక్కగున్నావే` టైటిల్ యాప్ట్ అవుతుందని చిత్ర టీమ్ నిర్ణయించిందట. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.