సమంత మిస్ గ్రానీ!!
on Dec 1, 2018
సమంత ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి `మజిలీ` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తన తదుపరి చిత్రంలో ఓ ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తోందట సమంత. అవును ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే మిటంటే... సమంతతో జబర్దస్త్ సినిమా చేసిన దర్శకురాలు నందిని రెడ్డి సమంతతో ఓ డిఫరెంట్ సినిమా ప్లాన్ చేసిందట. దీనికోసం నందిని రెడ్డి చాలా కాలంగా సమంత చుట్టూ తిరుగుతుందట. చాలా కాలం హోల్డ్ లో పెట్టిన సమంత ఇటీవల ఓకే చేసినట్లు తెలుస్తోంది.
అయితే నందినిరెడ్డి, సమంతతో `మిస్ గ్రానీ ` అనే కొరియన్ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసిందట. మిస్ గ్రానీ కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. 70 ఏళ్లు దాటిన ఓ బామ్మ ఫ్యామిలీ సభ్యులతో సమస్యలతో కొడుకు నుంచి విడిపోతుంది. ఆ తర్వాత విడిగా ఉండి ఓ రోజు ఓ ఫొటో తీసుకుందామని స్టూడియోకు వెళ్తుంది. అయితే అక్కడ జరిగిన కొన్ని అనూహ్యమైన సంఘటనలతో పాతికేళ్ల యువతీగా మారిపోతుంది. ఒకప్పటి రూపాన్ని దక్కించుకుంటుంది. అప్పటి నుంచి ఆమె జీవితం ఎలా మారిపోతుందనేది అసలు కథ . దాన్ని తెలుగు కి తగ్గట్టుగా మలిచే ప్రయత్నం చేస్తోందట నందిని రెడ్డి. సమంత మరి 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో నటించడానికి మొదట కొంత ఆలోచించిన ఎట్టకేలకు ఓకే చెప్పిందట. చూద్దాం ఎలా ఉంటుందో. సమంత కు జోడీగా నాగశౌర్య నటించనున్నాడట.