సమంతకు పాలిట్రిక్స్ తెలుసా!!
on Feb 9, 2019
టలీవుడ్ , కోలీవుడ్ చిత్ర పరిశ్రమల స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారా ? అనే టాపిక్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. రియల్ పాలిటిక్స్ లోకి కాకుండా సమంత రీల్ పాలిటిక్స్ లోకి రానున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఒక మూవీ రూపొందనుంది. నూతన దర్శకడు ఢిల్లీ ప్రసాద్ దీన దయాళ్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి హీరోగా పొలిటికల్ ఫాంటసీ తుగ్లక్ దర్భార్ మూవీ రూపొందనుంది. ఈ మూవీలో కథానాయికగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంతను సంప్రదించారని సమాచారం. భారీ బడ్జెట్ తెలుగు మూవీ సైరా నరసింహా రెడ్డి మూవీలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. తుగ్లక్ దర్భార్ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని నిర్మాత లలిత్ కుమార్ ప్లాన్. ప్రస్తుతం సమంత, విజయ్ సేతుపతి కి జంటగా సూపర్ డీలక్స్ తమిళ మూవీలో నటిస్తున్నారు. తుగ్లక్ దర్బార్ మూవీకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? లేదా ? వేచిచూడాల్సిందే.