English | Telugu

సల్మాన్ ఖాన్ కు రెండేళ్ల శిక్ష, జైలుకు తరలింపు..

on Apr 5, 2018

 

కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసును విచారించి రాజస్థాన్ లోని జోథ్ పూర్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. జింకలను చంపడం మానవత్వం కాదని.. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష ను విధించారు. శిక్షతోపాటు పదివేల జరిమానా కూడా విధించారు.   సల్మాన్ కు శిక్ష ఖరారుకాగానే, ఆయన్ను జోధ్ పూర్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు, కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకా ఈ కేసులోనిందితులుగా ఉన్న నలుగురు సహా నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబూ, నీలమ్ లను న్యాయమూర్తి నిర్దోషులని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో మిగతా నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై బిష్ణోయి సభ హైకోర్టులో అపీలు చేయాలని నిర్ణయించింది.

కాగా 20 సంవత్సరాల క్రితం, 1988లో జోధ్ పూర్ పరిసర ప్రాంతాల్లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బింద్రేలతో కలిసి పాల్గొన్న వేళ, వేటకు వెళ్లి కృష్ణ జింకలను సల్మాన్ వేటాడాడన్నది ప్రధాన అభియోగం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here