సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు
on May 6, 2015
.jpg)
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఘటన జరిగినపుడు సల్మాన్ ఖాన్ తాగి ఉన్నట్లు కోర్టు నిర్దారించింది. సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్ సింగ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు చెప్పిన కట్టుకథను నమ్మట్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సల్మాన్ ఖాన్ తాగి ఉండటమే కాకుండా ప్రమాద సమయంలో అతడి వద్ద లైసెన్స్ కూడా లేదని తెలిపింది. సల్మాన్ ఖాన్ పై 8 ఆరోపణలు రాగా, అన్నీ కూడా నిరూపణ అయినట్లు కోర్టు వెల్లడించింది. ఘటన తరువాత 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నేడు ఉదయం 11.15 గంటలకు తీర్పు వెలువడించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



