వర్మ ఏమిటి నీకు ఈ ఖర్మ..!!
on Mar 27, 2015
తన సినిమాలతోనే కాదు.. సంచలన కామెంట్స్‌తోనూ నిత్యం వార్తల్లో ఉంటాడు రాంగోపాల్‌వర్మ. మెగాస్టార్ చిరంజీవిని తిట్టే వర్మ పవన్‌కల్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తాడు. కాసేపటి తర్వాత అదే పవన్‌కల్యాణ్‌పై విమర్శల బాణాలు వదులుతాడు.అంటే తాను కామెంట్ చేయాలని అనుకోవాలే కాని.. అవతలవారు ఎంతటివారు, తాను ఎలాంటి అంశాలపై కామెంట్ చేస్తున్నాననే విషయాలు పట్టించుకోడు వర్మ. తాజాగా క్రికెట్‌పైనా తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. అసలే గురువారం నాటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమిపాలై ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉంటే.. పుండుపై కారం చల్లినట్లు క్రికెట్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు వర్మ. క్రికెట్ అంటే నాకు పరమ అసహ్యం. ఎందుకంటే ఈ దేశాన్ని నాశనం చేస్తోంది క్రికెట్ గనుక. క్రికెట్ మ్యాచ్ చూడటానికి తమ బాధ్యతలు మరిచి, పనులు విడిచిపెట్టి టీవీలకు అతుక్కుపోతారు. అలా ఈ దేశ ప్రజానీకాన్ని క్రికెట్ భ్రష్టు పట్టిస్తోంది. అందుకే నాకు క్రికెట్ అంటే పరమ అసహ్యం అని సోషల్ మీడయాలో కామెంట్స్ చేశాడు వర్మ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
