English | Telugu

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో తీసిన 'రెడ్‌' సాంగ్‌!

on Feb 21, 2020

 

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. తాజాగా 'రెడ్‌' సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మి స్తున్న ఈ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్ని డోలమైట్స్‌లో షూట్‌ చేయడం విశేషం. 

ఈ విషయాన్ని 'స్రవంతి' రవికిశోర్‌ వివరిస్తూ, "ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్‌లో రామ్‌, హీరోయిన్ మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో, మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే! ఈ రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్‌గా జరిగే వెనీడియా కార్నివాల్‌లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరిస్తాం" అని తెలిపారు. 

చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ "ఇస్మార్ట్ శంకర్‌ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న ఈ చిత్రం క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓపెనింగ్‌ రోజున ప్రకటించినట్టుగానే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం" అని చెప్పారు. రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌.


Cinema Galleries



Latest News


Video-Gossips