మీడియాని అభ్యర్థించిన రవి తేజ... దయచేసి అర్ధం చేసుకోండి
on Jul 5, 2017

రవి తేజ తమ్ముడు భరత్ కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అయితే, తమ్ముడి అంత్య క్రియలకి రవి తేజ హాజరు కాలేక పోయాడు. సొంత తమ్ముడు అలా విగత జీవిగా ఉండడం చూసి తట్టుకోలేనని, కాబట్టి చివరి చూపు చూసుకోవడానికి రాలేను అని ప్రకటించారు. అయితే, కొన్ని వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రక రకాల కథనాలతో రవి తేజ గురించి, అతడి తల్లి దండ్రుల గురించి అసత్య ప్రచారాలు మొదలు పెట్టారు.
అసలు, రవి తేజ కి కానీ అతని ఇతర కుటుంబ సభ్యులకి కానీ భరత్ అంటే గిట్టదని, అసలు అతన్ని ఎవరూ పట్టించోకోరని రూమర్స్ మొదలు పెట్టారు. ఇవన్నీ గత కొన్ని రోజులుగా చూసి విసిగి వేసారిన రవి తేజ మొత్తానికి మీడియా ముందుకొచ్చి తన అభ్యర్థన వెలిబుచ్చడం జరిగింది. తన తమ్ముడంటే తనకి ఎంత ఇష్టమో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనీ... తాను ఏ సందర్భంలో అంత్య క్రియలకి హాజరు కాలేదో ఇంతకు ముందే చెప్పానని... తనని అర్ధం చేసుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు మళ్ళీ చేయొద్దని... అవి తనని తన కుటుంబ సభ్యులని చాలా బాధించాయని వివరించారు. ఎవరికి ఇష్టం వాచినట్టు వాళ్ళు రాస్తే మాత్రం బాగుండదని కొంచెం గట్టిగానే చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



