'క్రాక్'తో రవితేజ నయా రికార్డ్!
on Jan 25, 2021
పవర్ ఫుల్ కాప్ డ్రామాగా తెరకెక్కిన 'క్రాక్' సినిమాతో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. పోతరాజు వీర శంకర్ పాత్రలో భూమ్ బద్దల్ పెర్ ఫార్మెన్స్ తో మాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్ టైన్ చేశారు. పాజిటివ్ టాక్ తో రిలీజైన ఈ సినిమా.. ఈ వీకెండ్ వసూళ్ళతో రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు.. రవితేజ ఖాతాలో నయా రికార్డ్ ని నమోదు చేసింది.
ఇంతకీ అదేమిటంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజైన మూవీస్ లో.. ఓ కథానాయకుడికి కెరీర్ బెస్ట్ గ్రాసర్ ని అందించిన తొలి సినిమాగా 'క్రాక్' రికార్డులకెక్కింది. ఇలాంటి రికార్డ్ ని నమోదు చేసుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రవితేజ వార్తల్లో నిలుస్తున్నారిప్పుడు. ఇది మాస్ మహారాజా అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే.
కాగా, ప్రస్తుతం రవితేజ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'ఖిలాడి'లో నటిస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.