'సుల్తాన్'ను చూసేందుకు ఇలా వచ్చింది రష్మిక! ఫొటోలు వైరల్!!
on Apr 3, 2021
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తారల్లో రష్మికా మందన్న ఒకరు. ఐదేళ్ల క్రితం కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'లో రక్షిత్ శెట్టి సరసన నటించడం ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మిగతా భాషా చిత్రాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. నాగశౌర్య జోడీగా నటించిన హిట్ ఫిల్మ్ 'ఛలో' ఆమె ఫస్ట్ తెలుగు సినిమా.
రెండో తెలుగు సినిమా విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం' బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె సెన్సేషనల్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత మహేశ్‌తో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్‌తో 'భీష్మ' సినిమాలు చేసిందామె. ఇప్పుడు లేటెస్ట్గా రిలీజైన 'సుల్తాన్'తో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది రష్మిక. మార్చి 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది 'సుల్తాన్'. అందులో రుక్మిణి అనే విలేజ్ గాళ్ రోల్లో ఒదిగిపోయి అదరగొట్టింది.
ప్రస్తుతం ఆమె తన బాలీవుడ్ సినిమాలు 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై' సినిమాలతో బిజీగా ఉంది. 'గుడ్‌బై' మూవీలో ఆమె అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ శుక్రవారమే మొదలైంది. ప్రస్తుతం ముంబైలోనే ఉన్న రష్మిక అక్కడ పీవీర్ సిటీ మాల్లో రిలీజైన 'సుల్తాన్' మూవీని చూసేందుకు వెళ్లింది.
వైట్ షర్ట్, జీన్స్ షార్ట్‌లో చాలా క్యాజువల్ లుక్‌తో కనిపిస్తున్న ఆమె కెమెరా కంటికి చిక్కింది. ముఖానికి మాస్క్ ధరించి, కారులోంచి కిందికి దిగి, మాల్‌లోకి వెళ్తున్న రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Also Read