ఫస్ట్ కార్తి.. నెక్స్ట్ సూర్య..?
on Nov 22, 2020
కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తోంది అందాల తార రష్మిక మందన్న. ఈ రెండు పరిశ్రమల్లోనూ ఘనవిజయాలు చూసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 'ఖైదీ' స్టార్ కార్తి కథానాయకుడిగా నటించిన 'సుల్తాన్'తో రష్మిక తమిళ చిత్ర సీమలో తొలి అడుగేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపే.. కార్తి అన్నయ్య, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుందట రష్మిక.
ఆ వివరాల్లోకి వెళితే.. సూర్య కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సూర్యకి జంటగా రష్మిక ఎంపికైందని కోలీవుడ్ బజ్. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తమ్మీద.. అన్నదమ్ములతో జోడీకట్టే అవకాశాలను అందిపుచ్చుకున్న రష్మిక.. ఆయా చిత్రాలతో విజయాలను కూడా ఒడిసిపట్టుకుంటుందేమో చూడాలి.