అతనో వంచకుడు..!
on Aug 9, 2017

‘అతనో వంచకుడు...!’.... ఒక హీరోను మరో హీరో అన్న మాట ఇది. కనీ... అతను ఏ ఉద్దేశంతో అన్నాడు? సందర్భం ఏమిటి? అనేవి ఇక్కడ గమనించాల్సిన విషయాలు. ఇంతకీ ఆ మాట అన్న హీరో పేరు చెప్పనే లేదు కదూ. ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్
కపూర్. ఇంతకీ ఆ ఫ్రాడ్ ఎవరు? అనేగా మీ అనుమానం. తను ఎవరో కాదు... ‘సంజయ్ దత్’.
ఇప్పటికే అనేక వివాదాలతో మునిగి, తేలి, ఈదుతున్న సంజయ్ ని... ప్రత్యేకించి ‘ఫ్రాడ్ మేన్’అని రణబీర్ అనడానికి కారణం.. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమానే. సంజయ్ దత్ జీవితానికి దర్శకుడు రాజ్ కుమార్ ఇరానీ తెర రూపం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమాలో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం తను ఎంతో హోమ్ వర్క్ కూడా చేశాడు. అంతేకాదు... సంజయ్ దత్ తో స్వయంగా ఎన్నో అనుభవాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా తనిచ్చిన ఓ ఇంటర్వ్యూ లో సంజయ్ దత్ ని ఓ ‘ఫ్రాడ్ మేన్’గా అభివర్ణించాడు రణబీర్.
‘మేం తీస్తోంది మహాత్మాగాంధీ కథ కాదు. ఓ ఫ్రాడ్ మేన్ కథ. అవును అతనో మోసగాడు... వంచకుడు. అతనిపై ప్రేక్షకులు ఎంతో అభిమానం పెంచుకున్నారు. కానీ... వారి ఆశలపై నీళ్లు చల్లాడు. విధి ఆయన్ను మోసం చేసింది. దాంతో అభిమానుల్ని మోసం చేయక తప్పలేదు. అందుకే అభిమనులే సంజయ్ ని ద్వేషిస్తున్న పరిస్థితి. తన జీవితంలో ఎదురైన ఎదురుతెబ్బల గురించీ., అందులోని తన పాత్ర గురించీ.. నిజాయితీగా చెప్పాడు సంజయ్. నేను చూసిన అతి కొద్దిమంది నిజాయితీ పరుల్లో ఆయన ఒకరు. ఆయన స్థానంలో నేనుంటే ఇంత నిజాయితీగా ఉండేవాడ్ని కాదేమో. ఈ సినిమా విడుదలయ్యాక.. ఆయన జీవితం గురించి ప్రజలు ఏదైనా గ్రహిస్తే.. మా ప్రయత్నానికి ప్రయోజనం కలిగినట్టే’ అని చెప్పుకొచ్చారు రణబీర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



