శర్వా లుక్, టైటిల్ అదిరిందిగా!!
on May 25, 2019
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానంభవతి, మహానుభావుడు వంటి ఫీల్ గుడ్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ హీరోగా, స్వామి రారా వంటి హిట్ మూవీ దర్శుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 27వ మూవీ రూపొందుతుంది. గ్యాంగ్ స్టార్ గా శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల టైమ్ ప్రకటిస్తూ ప్రీ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న శర్వానంద్ 27 వ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండి , సినిమాపై అంచనాలు పెంచిది. ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరో చిత్రాన్ని లైన్ లో పెట్టే యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. ఆ మధ్య టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేస్తూనే తమిళ రీమేక్ చిత్రం `96` ను పట్టాలెక్కించాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక తాజాగా సుధీర్ వర్మ కాంబినేషన్ మూవీని పూర్తి చేసి శర్వా, ఇప్పుడు `96` షూటంగ్ లో పాల్గొంటూనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళే ఆలోజనలో ఉన్నాడట. ఆ వివరాల్లోకి వెళ్లితే `భలే మంచిరోజు`, `శమంతకమణి`,`దేవదాస్` వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయునున్నాడని సమచాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.