'విరాటపర్వం' సెట్స్‌పై రానా
on Jan 20, 2020
పొడగరి హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నాడు. నాయికగా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.
'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు డాని సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇంతదాకా కనిపించని షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో రానా, డిగ్రీ స్టూడెంట్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు. 2020 వేసవిలో 'విరాటపర్వం'ను విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
