రామ్, అనిల్ రావిపూడి.. ఓ రొమాంటిక్ కామెడీ?
on Jan 18, 2021
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆరేళ్ళ సినీ ప్రస్థానంలో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా ఒకదానిని మించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు.. ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3ని తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ఇందులోనూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఎఫ్ 3 తరువాత అనిల్ రావిపూడి ఓ రొమాంటిక్ కామెడీని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
కాగా, రామ్ తాజా చిత్రం రెడ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. త్వరలోనే తమిళ దర్శకుడు ఆర్.టి. నేశన్ తో రామ్ ఓ బైలింగ్వల్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాతే అనిల్ రావిపూడి కాంబో మూవీ ఉంటుందేమో చూడాలి.