పవన్‌పై వర్మ డైరెక్ట్ ఎటాక్?
on Jul 13, 2020
సామాన్యులకు సరిగా అర్థం కాని ఓ వింత పదార్థం వర్మ. వివాదాలకు ఆజ్యం పోసి, లాజికల్‌గా మాట్లాడుతూ తప్పించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న వర్మ సినిమా 'పవర్ స్టార్', పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన మాత్రం కాదని అంటున్నారు. అసలు, ఈ నేపథ్యంలో అతడి మాట వినమంటూ వర్మ చేసిన ఒక ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.
"డియర్ పవన్ కళ్యాణ్ ఫాన్స్, రామ్ గోపాల్ వర్మను ఇగ్నోర్ చేయండి. ఆ సినిమాకు దూరంగా ఉండండి. ఎవరూ చూడకపోతే ప్రొడక్షన్ హౌస్ కి డబ్బులు రావు. వర్మ ట్వీట్స్ ఎంగేజ్ చేస్తూ ఎక్కువ రీచ్ దక్కేలా చేయండి. వుయ్ లవ్ పీకే ఫరెవర్" అని శశిధర్ రెడ్డి అని ఒకరు ట్వీట్ చేశారు. "యస్. దయచేసి అతడి మాట వినండి. ప్లీజ్" అని అతడి ట్వీట్ ని వర్మ కోట్ చేశారు. ఒక రకంగా పవన్ మీద వర్మ డైరెక్ట్ ఎటాక్ ఇది. దీని తరవాత వర్మ ఇంకో ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ పక్కన ఎవరో వ్యక్తి, తన కష్టాలు చెప్పుకొంటున్న ఫొటో అది. బహుశా... ఎన్నికల ప్రచార సమయంలోది కావచ్చు. దానికి 'వావ్' అని వర్మ కాప్షన్ ఇచ్చారు. ఇదంతా 'పవర్ స్టార్' సినిమా ప్రమోషన్ కోసమే.
Also Read