రామ్ గోపాల్ వర్మ 'లాక్డౌన్'
on Jul 13, 2020
వివాదాస్పద కథలను ఎంపిక చేసుకుంటూ, చకచకా సినిమాలు చేస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూకుడుకు ఎవరూ సాటి రారు, రాలేరు. లాక్డౌన్లో ఖాళీగా ఉన్న టాలీవుడ్ దర్శకులు కొత్త కథలపై ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంత షూటింగ్ చేసిన డైరెక్టర్స్, మళ్లీ ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయోనని ఎదురు చూపులు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్డౌన్లో చకచకా సినిమాలు తీస్తున్నారు.
ఏటీటీలో 'క్లైమాక్స్', 'నగ్నం' సినిమాలు రిలీజ్ చేసిన వర్మ, ప్రస్తుతం అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణాతో 'థ్రిల్లర్' సినిమా చేస్తున్నారు. 'పవర్ స్టార్' షూటింగ్ చేస్తున్నారు. అమృత, ప్రణయ్ కథ ఆధారంగా 'మర్డర్' అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా కొత్తగా 'లాక్డౌన్' అని ఇంకో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాల్లో నటించిన శ్రీ తేజ్ గుర్తున్నాడా? ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్'లో వైఎస్ రాజరేఖర్ రెడ్డి పాత్ర పోషించాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చంద్రబాబుగా నటించాడు. అతడు, పూజితా పొన్నాడ ప్రధాన పాత్రధారులుగా వర్మ 'లాక్డౌన్' తీయనున్నారు. ఆల్రెడీ 'కరోనా వైరస్' ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తున్నారు. అవి కంప్లీట్ అయిన తరవాత విడుదల చేయనున్నారు.
Also Read