ఆర్జీవీకి ఎథిక్స్ ఉన్నాయంటున్న 'నగ్నం' హీరోయిన్!
on Jul 4, 2020
రామ్‌గోపాల్‌వర్మకు ఎమోషన్స్, ఎథిక్స్ లేవని చాలామంది అనుకోవచ్చు కానీ, తాను మాత్రం ఆయనలో ఆ రెండూ చూశానని శ్రీ రాపాక అంటున్నారు. ఇటీవల ఆర్జీవీ తీసిన నగ్నం ఫిల్మ్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఏటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైన ఆ షార్ట్ ఫిల్మ్‌కు మంచి స్పందనే లభించింది. తాజాగా తెలుగు ఒన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవిని శ్రీ ప్రశంసల్లో ముంచెత్తారు. భవిష్యత్తులో తనకు ఆఫర్లు రాకపోయినా బాధపడననీ, తన వ్యాపారాలు తనకు ఉన్నాయనీ ఆమె అన్నారు.
"రామ్‌గోపాల్ వర్మ గారితో 'నగ్నం' సినిమా కోసం నేను రెండు రోజులు షూటింగ్ చేశాను. ఆయనలో నేను గమనించింది.. ఆయన ఎథిక్స్ ఉన్న వెరీ ఎమోషనల్ పర్సన్. 'ఆయనకేం ఎమోషన్స్, ఆయనకేం ఎథిక్స్.. కూతురినే చూడటం లేదు' అని చాలామంది అనుకోవచ్చు. ఆయన దగ్గర ఎమోషన్స్, ఎథిక్స్ అనేవి లేకపోతే ఆయనను ఇష్టపడి పదిమంది ఎందుకు పనిచేస్తారో చెప్పండి. అలా ఆయన దగ్గర కేవలం శాలరీ కోసం కాకుండా ఇష్టపడి పనిచేసేవాళ్లను నేను చూశాను. ఆయన క్యారెక్టర్‌ను బట్టే ఆయన వర్క్ వస్తోంది. రోజూ ఎంజాయ్ చేస్తుంటే ఎవరూ వర్క్ చెయ్యలేరు. నాలుగు సినిమాలు ఒకేసారి ఆయన చేస్తున్నారంటే.. అది చిన్న విషయం కాదు. ఆయనలో ఆ వర్క్ చేసే గుణం నాకు బాగా నచ్చింది" అని శ్రీ చెప్పారు.
"ఆర్జీవీ హీరోయిన్లెవరూ హిట్టవరనే పేరుంది కదా?" అనే ప్రశ్నకు, "అది నా ఫేస్ మీద, నా యాక్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయనతో శ్రీదేవి, ఊర్మిళ లాంటి వాళ్లు చేశారు కదా. వాళ్లు సక్సెస్ఫుల్ కదా. ఏదైనా మనం ఎంచుకునే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఆఫర్స్ రాలేదనుకోండి.. నా బిజినెస్ నాకుంది. ఈ సినిమా చెయ్యకముందు నేనదే చేస్తున్నాను కదా. ఏది చేసినా చెయ్యకపోయినా టీవీ షోస్ అయితే పక్కా చేస్తా. పైగా ఒకరిని మనం బ్లేమ్ చెయ్యకూడదు. ఆర్జీవీ గారితో పనిచెయ్యడం వల్ల ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అనడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నాకేమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అవకాశాలు వస్తే చేస్తా. లేదంటే నా జాబ్ నాకుంది" అని తేల్చి చెప్పారు శ్రీ.