రకుల్‌ని వదలని రామ్‌చరణ్?
on Feb 8, 2016

చిత్ర సీమలో హిట్ పెయిర్‌కి డిమాండ్ ఎక్కువ. ఓ ఫ్లాప్ సినిమాలో హీరోయిన్‌ని మరో సినిమాలోనూ తీసుకోవడం అది పెద్ద రిస్క్‌గా భావిస్తుంటారు. అయితే ఈ సెంటిమెంట్‌ని రామ్‌చరణ్ బొత్తిగా పట్టించుకోవడం లేదు. తన ఫ్లాప్ హీరోయిన్‌కి మరో అవకాశం ఇస్తున్నాడు. బ్రూస్లీ అట్టర్ ఫ్లాప్‌తో రామ్‌చరణ్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫ్లాప్‌తో రకుల్ ప్రమేయం ఏమీ లేకున్నా... పరాజయ భారం తానూ మోయాల్సివచ్చింది. అయితే రకుల్ టాలెంట్‌పై నమ్మకం ఉంచిన చరణ్.. తనకు మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం తని ఒరువన్ సినిమా రీమేక్‌పై దృష్టి పెట్టాడు చరణ్. ఇందులోకథానాయికగా శ్రుతిహాసన్‌ని ఎంచుకొందాం అనుకొన్నారు. అయితే ఇప్పుడా స్థానంలోకి రకుల్ వచ్చినట్టు టాక్. నాలుగైదు రోజుల్లో ఈ కాంబినేషన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈసారైనా ఈ జోడీ హిట్టు కొడితే బాగుణ్ణు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



