చరణ్...నువ్వు నిజంగా గ్రేటయ్యా!
on Aug 19, 2017

సినిమా వేడుకల్లో... అభిమానుల్ని తెగ పోడిగేయడం హీరోలకు పరిపాటే. అసలు ‘మీరు లేకపోతే మేం లేం’ అని ఒకాయనంటాడు. ఏ ‘ప్రతిఫలం ఆశించకుండా మమ్మల్ని ఇంత ప్రేమించే మీ రుణం ఎలా తీర్చుకోగలం’ అని ఇంకో ఆయన అంటాడు. సినిమా విడుదలవ్వగానే.. గప్ చిప్. మళ్లీ సినిమా ప్రమోషన్ కి వచ్చేసరికి ఫ్యాన్స్ గుర్తొస్తుంటారు ఈ మహానుభావులకు. అయితే... కొందరుంటారు. మాటలు మాత్రమే కాదు.. చేతల్లో కూడా చేసి చూపిస్తుంటారు. ‘ఇంత సంపాదిస్తున్నాం కాబట్టి... అందులో కొంతైనా అభిమానులకు ఖర్చు చేయాలి’అని తాపత్రయపడుతుంటారు. అలాంటి హీరోనే రామ్ చరణ్ కూడా. ఫస్ట్ నుంచి అభిమానుల విషయంలో రామ్ చరణ్ ప్రవర్తన అలాగే ఉంది.
మొన్నామధ్య ‘రంగస్థలం 1985’చిత్రం షూటింగ్ పనిమీద ఆయన గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు... గుండెజబ్బుతో బాధ పడుతున్న ఓ చిన్నారికి దగ్గరుండి గుండె ఆపరేషన్ చేయించాడు చరణ్. ఈ విషయంలో చరణ్ గ్రేట్ అనకతప్పదు. ఇలాంటి సంఘటనే ఇటీవల కూడా జరిగింది. ఇదే సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఆ విషయం తెలుసుకున్న తన అభిమాని చరణ్ ని కలుసుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడింది. అయినా ఆమెకు చరణ్ దర్శనం లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న చరణ్... తనే స్వయంగా వెళ్లి ఆ అభిమానిని కలిసి కుశల ప్రశ్నలు వేసి... ఆమెను తన స్టాఫ్ కి అప్పగించి, దగ్గరుండి ఇంటిదగ్గర విడిచిపెట్టి రమ్మన్నాడు. చరణ్ ఆదరణ చూసి ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ ఆ అభిమాని పేరు చెప్పలేదు కదూ... ఆమె పేరు దీపిక. పుట్టుకతోనే వికలాంగురాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



