English | Telugu

కారులో సెషన్... ట్విట్ట‌ర్‌లో డిస్కషన్!

on Jan 17, 2019

ట్విట్ట‌ర్‌లో ప్రజలు ఈ రోజు (గురువారం) రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం ర‌కుల్‌ను తిట్టేవాళ్ళు అయితే... మరో వర్గం ర‌కుల్‌కు మద్దతుగా నిలిచేవాళ్ళు. ఇరు వర్గాల మధ్య ట్విట్ట‌ర్‌లో మాటల యుద్ధం నడుస్తుంది. ట్విట్టర్ అంతా ఈ గొడవతో రచ్చ రచ్చే.  ఇందులో తప్పు ఎవరిది అని ఆలోచించే ముందు అసలు ఎవరేమన్నారు? అనేది ఓసారి చూడండి..

రచ్చ మొదలైంది ఈ ఫొటో దగ్గరే!

 

ముంబైలో సినిమా స్టార్స్ ఎక్కడ కనిపించినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయడం, వాటిని వెబ్‌సైట్స్ ప‌బ్లిష్ చేయ‌డం కామ‌న్‌. చాలా రొటీన్. స్టార్స్ కూడా ఈ ఫొటోలను కామ‌న్‌గా తీసుకుంటారు. రోటీన్‌ ప్రాసెస్‌లో భాగంగా రకుల్ ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అందులో ఈ ఫొటో ఒకటి. ట్విట్ట‌ర్‌లో ఒక అబ్బాయి ఈ ఫొటోను పోస్ట్ చేసి "కారులో సెషన్ (శృంగారం) పూర్తయిన తరవాత ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది" అని కామెంట్ చేశాడు. ఆ కుర్రాడు చేసిన కామెంట్ ముమ్మాటికీ తప్పే. అతణ్ణి చాలా మంది తిడుతున్నారు కూడా.

ట్విట్ట‌ర్‌లో తనపై వచ్చిన కామెంట్‌కి రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "మీ మదర్ కూడా కారులో చాలా సెషన్స్ చేస్తారనుకుంట. అందుకని, నువ్వు అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావ్. ఈ సెషన్స్ తో పాటు సంస్కారానికి చెందిన విషయాలు నేర్పమని మీ అమ్మను అడుగు. ఇటువంటి వాళ్లు ఉన్నంత వరకూ మహిళలకు రక్షణ ఉండదు. స్త్రీ పురుష సమానత్వం, మహిళల రక్షణ గురించి మాట్లాడటం వెస్ట్" అని రకుల్ ట్వీట్ చేశారు. ఆమెకు మద్దతుగా పలువురు నిలిచారు. అయితే.. రకుల్ రిప్లైలో మరో మహిళ గురించి ప్రస్తావించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కుర్రాడు తప్పు చేస్తే అతడి తల్లిని అనడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కొందరు అయితే 'సిక్ మైండ్ రకుల్' అని ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. విలువలు లేకుండా రకుల్ మాట్లాడుతున్నారని తిట్టారు. వాళ్లకూ రకుల్ ఘాటుగా సమాధానం చెప్పారు.

 

 

"నా విలువల గురించి ప్రశ్నిస్తున్న వారందరూ ఓ మహిళపై అసభ్యకర కామెంట్స్ చేసినప్పుడు ఏం చేశారు? వాళ్ళను ఎందుకు ప్రశ్నించలేదు. అసభ్యంగా మాట్లాడేవాళ్ళకు నా భాషలో బుద్ది చెప్పాలనుకున్నా. వాళ్లకూ ఓ కుటుంబం ఉంటుంది. వాళ్ల కుటుంబ సభ్యులను ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? అతడు చేసిన పనికి వాళ్ల అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి ఉంటుందని ఆశిస్తున్నా" అని రకుల్ పేర్కొన్నారు. ఆమెకు ఎంతమద్దతు లభిస్తుందో? అంతే స్థాయిలో ఆమెపై విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి.


Cinema GalleriesLatest News


Video-Gossips