'హిట్' హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావ్
on Jul 15, 2020
వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై హీరో నాని సమర్పణలో విష్వక్సేన్ హీరోగా నటించిన 'హిట్: ద ఫస్ట్ కేస్' మూవీ బాలీవుడ్లో రీమేక్ కానున్నది. విలక్షణ నటుడిగా పేరుపొందిన రాజ్‌కుమార్ రావ్ ఇందులో హీరోగా నటించనుండగా, ఒరిజినల్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ రీమేక్‌కూ దర్శకత్వం వహించనున్నాడు. 'హిట్' మూవీతోనే అతను డైరెక్టర్‌గా పరిచయం కావడం గమనార్హం. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కుల్దీప్ రాథోడ్‌తో కలిసి ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.
క్రైమ్ థ్రిల్లర్‌గా శైలేష్ కొలను రూపొందించిన 'హిట్' సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకొని టైటిల్‌ను సార్థకం చేసుకుంది. తొలి సినిమాకే పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో శైలేష్ ఆ మూవీని తీసిన విధానాన్ని విమర్శకులు సైతం మెచ్చారు. ఇక సీఐడీ డిపార్ట్మెంట్లోని హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్లో విష్వక్సేన్ ప్రదర్శించిన అభినయం కూడా ఈ సినిమా విజయానికి దోహదం చేసింది. ఆ రోల్‌ను బాలీవుడ్ పాపులర్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ చేయనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాగిణి ఎంఎంఎస్, షాహిద్, తలాష్, కై పో చే, హమారీ అధూరీ కహానీ, రాబ్తా.. తదితర చిత్రాలతో రాజ్‌కుమార్ రావ్ ప్రేక్షకులను అమితంగా అలరించాడు. ఇవాళ బాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకడిగా అతను గుర్తింపు పొందాడు. అలాంటి నటుడు 'హిట్' రీమేక్‌లో నటించేందుకు అంగీకరించడంతో డైరెక్టర్ శైలేష్ కొలను సంతోషంగా ఉన్నాడు.