'కల్కి' సింగిల్ టేక్...
on Jan 5, 2019
యాంగ్రీ యంగ్‌మాన్, 'పీఎస్వీ గరుడవేగ'తో ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'కల్కి'. 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని సింగిల్ టేక్‌లో చేసి రాజశేఖర్ యూనిట్ సభ్యులను సర్ప్రైజ్ చేశారు. అదీ బాడీ డబల్ లేకుండా, హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని చేశారని సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే... 'కల్కి'లో ఓ యాక్షన్ సీక్వెన్స్ వుంది. ఏడు నిమిషాల నిడివి గల ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో వాల్ జంపింగ్స్ (గోడలు దూకడం)తో పాటు పరుగులు తీయడం, ఛేజ్‌లు వంటివి వున్నాయట. ముందు ఈ సీక్వెన్స్‌ని సింగిల్ టేక్‌లో తీయాలని రాజశేఖర్‌కి దర్శకుడు చెప్పగా... ఆయన మరో మాట మాట్లాడకుండా పూర్తి చేశారట. సినిమా పట్ల రాజశేఖర్ కమిట్మెంట్, డెడికేషన్ చూసి యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టారని తెలిసింది. సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ వున్నాయట. అన్నిటినీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో షూట్ చేస్తున్నారట. సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవుతాయని యూనిట్ అంటోంది. ఇటీవల విడుదలైన రాజశేఖర్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి అద్భుత స్పందన లభిస్తోంది.