RRR టీమ్‌కి రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్!!
on Nov 16, 2018
బాహుబలి ది బిగినింగ్` చిత్రం సినిమా షూటింగ్ సమయంలో డైరక్టర్ రాజమౌళి కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అవి ఏమిటంటే సినిమాకు సంబంధించిన 14 నిమిషాల లెంగ్త్ గల వీడియో ఒకటి లీక్ అవడం. ఈ సంఘటన టీమ్ అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆ తర్వాత ఆడియో రిలీజ్ కు ముందే పాటలు కూడా లీకయ్యాయి. వెంటనే రాజమౌళి అండ్ టీమ్ తేరుకుని లీకైన లింకుల్ డిలీట్ చేయించారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృత్తం కాకుండా సెకండ్ పార్ట్ కి చాలా కేర్ తీసుకున్నారు. ఇటీవల గీతం గోవిందం. టాక్సీవాలా చిత్రాలు లీకులు అందర్నీ కలవరపెడుతున్నాయి. అయితే ఇటీవల మొదలైన భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం లీకుల బారిన పడకుండా రాజమౌళి చాలా కేర్ తీసుకుంటున్నారట. ఇటీవల టీమ్ అందరినీ పిలిచి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారట. లొకేషన్ లో మొబైల్స్ వాడుకూడదంటూ కండిషన్స్ కూడా పెట్టారట. ఎటువంటి లీకు బయటకు పొక్కడానికి వీల్లేదని చెప్పాడట. అలాగే చైనా నుంచి జామర్స్ తెప్పించారట. ఈ జామర్స్ వల్ల సీక్రెట్ కెమెరాలు , పెన్ కెమెరాలు ఏ వి తీసుకొచ్చినా కానీ పని చేయవట. ఈ టెక్నాలజీ ఎంత వరకు లీక్ ల బెడద నుంచి తప్పింస్తుందో మరి చూద్దాం.