English | Telugu

"టెంపర్" పీపుల్స్‌స్టార్‌దేనట..?

on Jan 6, 2017

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంభినేషన్‌లో తెరకెక్కిన టెంపర్ సినిమా‌లో నిజాయితీ గల కానిస్టేబుల్‌గా పోసాని కృష్ణమురళి యాక్టింగ్‌ని ఎవ్వరూ మరచిపోలేరు..కామెడీయన్‌గా నవ్విస్తూ వస్తున్న పోసాని‌ని సీరియస్‌ రోల్‌లో చూపించాడు పూరి..ఆ సినిమాలో పోసాని డైలాగ్‌లు ఇప్పటికీ అభిమానుల నోళ్లలో నానుతాన్నాయంటే ఆ క్యారెక్టర్ గొప్పతనం ఎంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే పోసాని కంటే ముందు ఆ అవకాశం వేరొకరు చేయాల్సిందట..ఆయన ఎవరో కాదు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి. ఈ విషయాన్ని నారాయణమూర్తి స్వయంగా వెల్లడించారు. ఈ తరం దర్శకుల్లో పూరీ గారంటే నాకు చాలా ఇష్టం..నేనంటే కూడా ఆయనకు అంతే అభిమానం..ఆ అభిమానంతోనే టెంపర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోగా ఎదిగిన నేను మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాలనుకోవడం లేదు..చేస్తే హీరోగా చేయాలన్నది నా భావన. అందుకే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను అని తెలిపారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here