వారణాసిలో 'పుష్ప' గీతాలాపన
on Nov 30, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మారేడుమిల్లి అడవుల్లో శరవేగంగా జరుగుతోంది. కాగా, డిసెంబర్ 18 నుంచి వారణాసిలో 'పుష్ప'కి సంబంధించి ఓ పాటని భారీ ఎత్తున
చిత్రీకరించడానికి సుక్కు అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ గీతం సాగుతుందని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఈ పాటకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
'ఆర్య', 'ఆర్య 2' తరువాత బన్నీ, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప'.. వారిద్దరికి హ్యాట్రిక్ వెంచర్ గా నిలుస్తుందేమో చూడాలి. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. 'పుష్ప' చిత్రాన్ని
నిర్మిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
