రవితేజతో ప్రణీత ఆటాపాటా?
on Nov 30, 2020
వీర చిత్రం తరువాత మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. రవితేజ, ప్రణీత కాంబినేషన్ లో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. ప్రణీత ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నాయికగా సందడి చేసింది. మరి.. మాస్ మహరాజా రవితేజ చిత్రంలో ఆమె ఆటాపాటా తన కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, ఖిలాడి 2021 వేసవిలో జనం ముందుకు రానుంది.