ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్...
on Apr 19, 2017
బాహుబలి సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్నారు. బాహుబలి సినిమాకు గాను ప్రభాస్ దాదాపు ఐదు సంవత్సరాలు మరే ఇతర సినిమాలు ఒప్పుకోలేదు. ఇక ‘బాహుబలి :ది కన్‌క్లూజన్’ పేరుతో సెకండ్ పార్ట్ ఈనెల 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు మరో శుభవార్తను అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు ప్రభాస్. అదేంటంటే... సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘ప్రభాస్ 19’ కు సంబంధించి.. టైటిల్‌లోగో, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 28న టీజర్‌ను నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు దీనిని బాహుబలి2 థియేటర్లలో ప్రదర్శిస్తారట. కాగా యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ త్రయం సంగీతం అందిస్తోంది.