'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ ఇండియా రికార్డ్!
on Oct 26, 2020
రాజమౌళి రూపొందించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి మాసివ్ సక్సెస్ కావడం, అశేష సంఖ్యలో ప్రేక్షకుల్ని అలరించడంతో గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు ప్రభాస్. దాంతో తన తదుపరి సినిమాని ప్రకటించినప్పుడల్లా, దాని చుట్టూ అసాధారణమైన బజ్ ఏర్పడటం సహజం.
ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా గురించిన ప్రతి చిన్న సమాచారం ఇవాళ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారుతూ వస్తోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాతలు ఇటీవల విడుల చేశారు. కేవలం 24 గంటల్లో 15 మిలియన్ల వ్యూస్‌ను ఇది దాటి, ఆ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ మూవీ మోషన్ పోస్టర్‌గా సరికొత్త రికార్డును సృష్టించింది. అందమైన ప్రేమకథాచిత్రంగా 'రాధే శ్యామ్' మన ముందుకు రానున్నదనే అభిప్రాయాన్ని ఈ మోషన్ పోస్టర్ కలిగిస్తోంది.
ఈ ప్రేమకథలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ ఎంత అందంగా ఉంటుందో కూడా మనం మోషన్ పోస్టర్‌లో చూశాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం సహా మరికొన్ని భారతీయ భాషల్లో విడుదల కానున్నది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
